Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొగవర్నర్, వీసీ, పాలక మండలి సభ్యులకు ఓయూ ఎస్ఈ దేవిదాస్ జైజర్ వినతి
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవికి తాను అన్ని విధాలా అర్హుడనని, తనకు ఆ పదవి ఇవ్వాలని ఓయూలో ప్రస్తుత సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) దేవిదాస్ జైజర్ అధికారులను కోరారు. కొన్ని సంవత్సరాలుగా తనకు అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు 38 సంవత్సరాల అనుభవం ఉందని, ఎస్ఈగా ఆరేండ్ల అనుభవం ఉందని చెప్పారు. తనకంటే జూనియర్ అయిన ప్రొఫెసర్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ జీఓ ఎంఎస్ నెం.32 (25-04-2018) ప్రకారం ఇటీవల యూనివర్సిటీ నియమించిన చీఫ్ ఇంజనీర్ ఆ పదవి అనర్హుడని తెలిపారు. ఈ విషయంలో తాను న్యాయపోరాటం చేస్తానని, కమిషన్స్‌ను ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఇటీవల నియమించిన ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ పోస్టును తనకు తెలియకుండా ప్లాన్ ప్రకారం భర్తీ చేశారని ఆరోపించారు. గతంలో (1-02- 1991) 34వ ఈసీ సమావేశంలో అందరి ఆమోదం ద్వారా ఓయూలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ను గుర్తు చేశారు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్న తనను ఇంజనీరింగ్ చీఫ్‌గా నియమించాలని గవర్నర్ ( వర్సిటీల ఛాన్సలర్)కు, వీసీకి స్పీడ్ పోస్టు ద్వారా వినతులు పంపినట్టు తెలిపారు. ఇక ఓయూ పాలక మండలి సభ్యులల్లో కొందరిని స్వయంగా కలిసి జరిగిన విషయాన్ని చెప్పి వినతిపత్రం అందజేశానన్నారు. ఇంకోవైపు తనకు గత ఆరేండ్లుగా రావాల్సిన బిల్స్ కూడా నిబంధనల మేరకు రావడం లేదన్నారు. తన ఆమోదం ద్వారానే అడ్మిస్ట్రేషన్‌కు ఫైల్స్ / బిల్స్ వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదన్నారు. గతంలో కూడా తనకు ఎస్ఈ పోస్టు సకాలంలో ఇవ్వలేదని, దాంతో తాను జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి ఎస్ఈ పోస్టును పొందానని చెప్పారు. ఆ పోస్టు ఇచ్చినట్టే ఇచ్చి తనకు ఎటువంటి అడ్మిస్ట్రేషన్ పవర్స్ లేకుండా చేశారని ఆరోపించారు. పదవి ఇచ్చినా చెక్ పవర్ సకాలంలో ఇవ్వకుండా ఐదేండ్ల తర్వాత ఇచ్చారని చెప్పారు. ఈ విధంగా తనకు సీనియారిటీ ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కకపోగా పోరాటం ద్వారా సాధించుకున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే ఓయూ ఈఈ-1 దేవిప్రియ తనకు చెక్ పవర్ రద్దు చేయాలని, నేరుగా మంత్రి హరీశ్ రావుకు లెటర్ రాశారని, ఆమెపై యూనివర్సిటీ శాఖాపరమైన చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. దీనివెనుక ఎవరున్నారో కూడా తనకు తెలుసు అన్నారు. తనకు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఇచ్చి, నిబంధనల ప్రకారం ఫైల్స్ / బిల్స్ అడ్మిస్ట్రేషన్‌కు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.