Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొకూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/కూకట్పల్లి
అన్ని హంగులతో ఫ్లై ఓవర్ నిర్మాణం రూపుదిద్దుకుంటోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం అల్లాపూర్ డివిజన్లో రూ.85 కోట్లతో ఖైత్లాపూర్ నుంచి ఎస్బీఐ కాలనీ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల నాణ్యతను ఆయనతో పాటు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్, బాలాజీనగర్ డివిజన్ పగుడాల శిరీషా బాబురావు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసొద్దీన్, మాజీ కార్పొరేటర్ బాబురావులు పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యూసుఫ్ నగర్ నుంచి గాయత్రినగర్, సప్దర్నగర్ నుంచి వివేకానందనగర్‌కు వెళ్లేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఐలయ్య, కో అర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, నాగుల సత్యం, బాబా, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కాశీనాథ్చారి, రోణంకి జగన్నాథం, ఇస్మాయిల్, మస్తాన్‌రెడ్డి, యోగిరాజ్, రాము యాదవ్, కమ్మరి శ్రీనివాస్, శ్రీను, మల్లేష్, సంజీవరెడ్డి, లక్ష్మీ, మణేమ్మ, మహేందర్‌రెడ్డి, శ్రీధర్, రమేష్, ధన్రాజు, బద్రునాయక్, మల్లికార్జున్, శివ, రాజయ్య, నూర్ఖాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి
దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లబ్దిదారులను కోరారు. గురువారం శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన దళితబంధుపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దళిత బంధు విడతలవారీగా ప్రతి ఒక్కరికీ వస్తుందని, అర్హులైన వారు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. రానున్న ఏడేండ్ల కాలంలో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం చేరుతుందన్నారు. దళితులు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా ఎదగాలనేది సీఎం ఆకాంక్ష అని అన్నారు.