Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ొశేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యకర భవిష్యత్తుకి ఇచ్చే భరోసా అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ నెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పని సరిగా వేయించాలని తెలియజేసే పోస్టర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ... నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పక అవసరం అన్నారు. తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, కాలనీలోని కమ్యూనిటీ హాల్స్‌లో, ముఖ్య కూడళ్లు, బస్టాపులవద్ద, రైల్వే స్టేషన్ల వద్ద, మొబైల్ టీమ్‌ల ద్వారా పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ బండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస, నర్సులు నదియా, జ్యోతి, సంతోషి, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాయకులు ఇబ్రహీం పాల్గొన్నారు.