Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్, గాంధీనగర్లో కొంత మంది వ్యక్తులు రోడ్డు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని స్థానిక ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్ ఐ స్వర్ణలత గాంధీ నగర్ రోడ్డును పరిశీలించారు. గతంలో కాలనీ ఏర్పడినప్పుడు కాలనీ రోడ్డు ఉందనీ, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.