Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ బోయన్ చెరువు లో జరుగుతున్న అక్రమ కబ్జాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేయనున్నట్టు బీజేవై ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ తెలి పారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లా డుతూ చెరువు కబ్జా చేస్తున్నా ఏమీ జరగడం లేదని తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తున్నా అక్ర మాలు, కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. అధికారులు కూడా చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అండ లేకపోతే చెరువులో నిర్మాణాలు ఏ విధంగా జరి గాయని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించకపోతే అక్రమ నిర్మాణాలు ఆపేందుకు ఉద్యమిస్తామన్నారు.