Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం అని కార్పొరేటర్ గీత అన్నారు. శుక్రవారం డివిజన్లోని వెంకటేశ్వర కాలనీ, ఆనంద్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. వెంకటేశ్వర కాలనీ, ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన స్పందిస్తూ లో వాటర్ ప్రెజర్ ఏరియాలను, పలు గల్లీల్లో కొత్త వాటర్ పైప్ లైన్, సివరేజ్ లైను ఏర్పాటు చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్, డీజీమ్ రజనీకాంత్ రెడ్డి, సత్యనారాయణకు కొత్త జంక్షన్లో ఏర్పాటు చేస్తూ వాటర్‌లో ప్రేషర్ను అరికట్టాలని సూచించారు. విధంగా పలు గల్లీల్లో నూతన సివరేజ్ లైను, వాటర్ పైపులు ఏర్పాటు కోసం ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీజీమ్ రజినీకాంత్ రెడ్డి, సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్ రెడ్డి, రామ్‌రెడ్డి, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, సుందర్, ఉపేందర్, అశోక్ చారి, బలెందర, మహిళా నాయకులు అండాలు, షేహనాజ్, సత్యవతి, విజయలక్ష్మీ, భాగ్యలక్ష్మి, బాలమని, తదితరులు పాల్గొన్నారు.