Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్పేట్ మాజీ ఎంపీటీసీ గౌర వెంకటేష్ సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు. శుక్రవారం వెంకటేష్ 8వ వర్ధంతిని పురస్కరించు కుని బడంగ్పేట్ చౌరస్తాలో జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు పాల్గొని వెంకటేష్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పి ంచారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ వెంకటేష్ అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేశారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి అదుకునేవారనీ, అలాంటి వ్యక్తి మనందరికి దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గ్రామ అభివృ ద్ధితోపాటు పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి అభాగ్యులకు అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో సామ సంజీవరెడ్డి, కార్పొరేటర్లు లిక్కి మమతాకృష్ణారెడ్డి, సుర్ణగంటి అర్జున్, గౌర రమాదేవి శ్రీనివాస్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ నడికూడ యాద గిరి, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబావి వెంకట్‌రెడ్డి, నాయకులు పెద్దబావి సమరసింహరెడ్డి, కర్రె బల్వంత్, వట్టి వెంకటేష్ యాదవ్, అశంగారి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు బాలకృష్ణ, దొడ్డి మల్లికార్జున్, గట్టు మహిపాల్, చిత్రం శ్రీనివాస్, గౌర కిషోర్, సంజీవరెడ్డి, రాళ్లగూడెం రామకృష్ణా రెడ్డి,్డ కిషన్, నాగభూషణం, భాస్కర్, రమాకాంత్, శ్రీనివా స్‌గౌడ్, నాగేంద్ర, రజినీకాంత్, కుమార్, అమర్నాధ్, శివకు మార్, శ్రీనివాస్, రాకేష్, శ్రీకాంత్, రాము, గౌర సాయి, నిఖిల్, గట్టు వెంకటేష్, సుధాకర్, వినోద్ పాల్గొన్నారు.