Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయినపల్లి చిన్నతొకోట బస్తీవాసులకు శుక్రవారం మాజీ బోర్డు సభ్యుడు జంపన ప్రతాప్ డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు సీఈఓ అజిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారన్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా సంఘ సేవకుడు ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు అశోక్ ముదిరాజ్ సహాయంతో డస్ట్ బిన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నతొకోట ప్రతినిధులు ముఖేష్ యాదవ్, సీతారాం, అశోక్‌కుమార్, జనార్దన్, గండి లక్ష్మణ్, చిన్న యాదవ్, మున్నా, విజరు, అజరు, సాయి, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.