Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
ప్రజా ఐక్య పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిస్కారం అవుతాయనీ, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశ వ్యాప్త సారస్వతిక సమ్మెను విజయవంతం చేయాలని బీడీఈయూ హనరరి ప్రసిడెంట్ జె.వెంకటేష్ అన్నారు. శుక్రవారం బీడీఎల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వల్ల ఎంతో మంది కార్మికులు వీధిన పడతారన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను సవరించానీ, బ్యాంకులకు కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన అప్పులు రికవరీ చేయాలనీ, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ పెంచాలనీ, ఐసీడీఎస్ అంగన్వాడీల భద్రత కోసం బడ్జెట్లో నిధులు పెంచాలనీ, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలనీ, ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలనీ, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలనీ, పెట్రోల్, డీజిల్‌పై పెంచిన పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బాపురావు, బీడీఈయూ ప్రసిడెంట్ జి.ఆర్.విజయ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.మురళి, వర్కింగ్ ప్రసిడెంట్ దానకర్ణాచారి, తెలంగాణ యూనియన్ అధ్యక్షులు శ్రీలక్ష్మి, డిప్యూటీ జెనరల్ సెక్రెటరీ, కోశాధికారి సత్తయ్య పాల్గొన్నారు.