Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులపై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.311 కోట్లతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టు పనుల రూపకల్పన నమూనా (మ్యాప్) పటంను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం కంటిన్యుటీ టూ పీర్జాదిగూడ ఫ్లైఓవర్ నుంచి డీఎస్ఎల్ విర్శూ మాల్ రామంతపూర్, ఉప్పల్ ఇంటర్నల్ టు ఉప్పల్ స్టేడియం కారిడార్ ఎల్ షేప్, రాజలక్ష్మి థియేటర్ ఉప్పల్ నుంచి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ ఆర్ మెట్రో పార్లల్ వరకు ప్రజలకు అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురా వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ ఈ. రోహిణి, డీఈ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.