Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకురావాలని మేడ్చల్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఫతేనగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్ గంధం చంద్రశేఖర్ అధ్వర్యంలో భగత్ సింగ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 200 మందికి సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వాసిరెడ్డి రవి, డివిజన్ అధ్యక్షుడు కె.రమేష్, ఏ బ్లాక్ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, రాజు ముదిరాజ్, యువజన నాయకుడు సిటకోరు కృష్ణ, అరుణ్, ఎజాజ్, ఏ బ్లాక్ సెక్రెటరీ, బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేం దర్, ఐఎన్ టీయూసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.