Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీసీపీ చందనా దీప్తి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండకూడదనీ, ఒకవేళ ఉంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కోసం నిర్మిస్తున్న కొత్త భవనంలో కలియ తిరిగి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. డీసీపీ వెంట సీఐ రవి కమార్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.