Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
ఈ నెల 27, 28 తేదీల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని జెడ్పీహెచ్ఎస్ తుర్కయంజాల్ పాఠశాలలో శుక్రవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇ.గాలయ్య మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ సమావేశాలకు జిల్లా నుంచి ప్రతినిధులు, పరిశీలకులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చెర్క రాందాసు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు బి.అనిల్ కుమార్, జీ.నరసింహ, టి.నరసింహ, తదితరులు పాల్గొన్నారు.