Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను బల్దియా బడ్జెట్‌ను రూపొందించినా తాత్కాలికంగా వాయి దా వేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే బడ్జెట్‌ను పొందుపర్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అయితే ప్రతిసారి కేంద్ర బడ్జెట్ కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది. ఈ సారి మాత్రం కేంద్రబడ్జెట్ తర్వాతనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. సాధారణంగా అయితే నవంబర్‌లో బడ్జెట్ రూపకల్పన ప్రారంభమై జనవరి వరకు ప్రక్రియ పూర్తి కావాలి. తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన తర్వాత సర్వసభ్య సమావేశంలోనూ ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇదేమీ ఇంతవరకు జరగలేదు. పైగా వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ ప్రారంభ మవుతుంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. అధి కారులు సైతం 2022-23 సంవత్సరం బడ్జెట్‌ను రూపొ ందించారు. కానీ తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టారు.
10శాతం అదనం
జీహెచ్ఎంసీ బడ్జెట్ గతం కంటే 10శాతం అదనంగా పెంచి రూపొందిస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బడ్జెట్‌తో కలిపి 2021-22లో రూ.6,841.87కోట్లుగా నిర్ణయించా రు. కానీ జీహెచ్ఎంసీ సాధారణ బడ్జెట్ మాత్రం రూ.5,600 కోట్లుగా చూపించారు. దీని ప్రకారం ఈ సారి రూ.6,160 కోట్లకుపైగా ఉండే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీ బడ్జెట్లో రూ.3,571కోట్లు రెవెన్యూ ఆదాయంగా చూపించారు. మూలధన ఆదాయం రూ.983.04కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ ఆదాయంలో అత్యధికంగా 32 శాతం ఆదాయం ఆస్తిపన్ను ద్వారా రూ.1850 కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మరో 22 శాతం నిధులను రుణాల ద్వారా రూ.1224.51 కోట్లను సేకరించాలని నిర్ణయించారు. 17శాతం నిధులు రూ.1022.70 కోట్లు ఫీజులు, యూజర్ చార్జీల కింద ద్వారా, 14 శాతం నిధులు రూ.770.51 కోట్లు ప్లాన్ గ్రాంట్ల కింద రానున్నాయని, 13 శాతం నిధులు రూ.652.10 కోట్లు అసైండ్ రెవెన్యూ, 3 శాతం నిధులు రూ.189.69 కోట్లు క్రమబద్దీకరణ ఫీజులు, ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా, మరో రూ.22.84 కోట్లు కాంట్రిబూషన్ ద్వారా రానున్నాయని బడ్జెట్ లెక్కల్లో సూచించారు. ఈ బడ్జెట్లో అత్యధికంగా రోడ్లు, పేవ్మెంట్స్ కోసం రూ.1,582.51 కోట్లు ఖర్చుచేయాలని అంచనా వేశారు. దీంతోపాటు 10శాతం నిధులు గ్రీన్ బడ్జెట్‌కు రూ.560 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. మరో 16 శాతం నిధులు రూ.905.30 కోట్లను ఆపరేషన్స్, నిర్వహణ కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదనల్లో ఉన్నాయి. వీటన్నిం టిలో 10శాతం పెరిగే అవకాశముంది.
కేటాయింపులే...
రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా బడ్జెట్లో జీహెచ్ఎంసీ నామమాత్రంగానే కేటాయిస్తోంది. కేటాయించిన నిధులను సైతం విడుదల చేయని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయని భావించిన నిధులను సైతం ఇవ్వడం లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించాలని జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు ఈ సారి కూడా బల్దియాకు అప్పులు తప్పేలా లేవు. నాలా అభివృద్ధి పనులు, మూసీ నిర్మించనున్న 15 బ్రిడ్జీల కోసం జీహెచ్ ఎంసీ అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, లింకురోడ్లు, ఇతర పనుల కోసం రూ.5వేల కోట్లకుపైగా అప్పులు చేసిన విషయం తెలిసిందే.