Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్/బాలానగర్/ఘట్కేసర్/కాప్రా/ శామీర్‌పేట్/వనస్థలిపురం
కేంద్ర బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపూర్ణంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకంగా ఉందనీ, దాన్ని వెంటనే సవరించి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు అత్యధిక నిధులు కేటాయించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్ రంగాలకు కట్టబెట్టడం కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో సవరణలు చేసి విద్య, వైద్యానికి, వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి కోత సరికాదని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ కార్యదర్శి పి.నాగేశ్వర్, చాంద్రాయణగుట్ట సీఐటీయూ జోన్ కార్యదర్శి ఎస్.కిషన్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట బండ్లగుడ దగ్గర ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎండీ.గౌస్, కలిమ్, ఫారూఖ్, దిలీప్, వాజీద్ పాల్గొన్నారు.
పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టి బడ్జెట్లో ప్రజాను కూలంగా సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ బాలానగర్ కమిటీ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని అమరజ్యోతి పెట్రోల్ బంక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యద ర్శి ఐలాపురం రాజశేఖర్, సీఐటీయూ నాయకులు, నవనీత, లక్ష్మి, వనిత, జగన్, శంకర్, సుగుణ, సతీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, లక్ష్మి, రాజేశ్వరి, లత, సబిత పాల్గొన్నారు.
బీజేపీ కేంద్ర సర్కార్ జాతీయ ఆస్తుల నగదీకరనకు పాల్పడుతుందని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్.సబిత, చింతల యాదయ్య ఆధ్వర్యంలో ఘట్కేసర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీఎం వర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జి.జయంత్ రెడ్డి జి.జీవన్ రెడ్డి, జి.వెంకయ్య, సీహెచ్ వెంకటేశ్వర రావు, సీహెచ్ మల్లేష్, జి. హన్మంత్, కె.కీష్ణ, సీహెచ్ సతీష్, పి.కృష్ణారెడ్డి, యాకాంత, ఎం.గోవర్ధన్, శ్రీరాములు పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్లో సంపన్నులకు రాయితీలు, సంక్షేమానికి కోతలు పెట్టడం దుర్మార్గం అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం సురానా చౌరస్తా లో సీఐటీయూ ఆధ్వ ర్యంలో ధర్నా చేపట్టారు. రైతులు, కూలీలు, పేద, మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ చర్లపల్లి కోశాధికారి శ్రీనివాసరావు, నాయకులు శ్రీనివాస్, నరసింహ, మణికంఠ, తిరుమల రాజు, వసంతరావు, ఆదామ్, చారి, రాజు, వెంకటేష్ బీమా, మూర్తి, సుధాకర్ పాల్గొన్నారు.
కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టప్ప, రమేష్, నర్సింహ, ఆంజనేయులు, గణేష్, చంద్రకళ, రజిత, మంజుల పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక కార్మిక, ఉద్యోగ వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ వనస్థలిపురం లేబర్ అడ్డా దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, నాయకులు సత్యనారాయణ, ఆంజనేయులు, అంజ య్య, పురుషోత్తం, అంజయ్య గౌడ్, నరసింహ, గద్దల వెంకటేశ్వర్లు, సైదులు, సుఖీ బాయి, మోతి బారు, ఎల్లమ్మ, జయమ్మ, రేణుక, లింగయ్య, యాదయ్య, బాలయ్య పాల్గొన్నారు.