Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
ఏడు కిలోలా 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నింధితులను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి టి.రవీందర్ రావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి సరూర్‌నగర్ కె.శ్రీనివాస రావు పర్యవేక్షణలో దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి కమాన్ వద్ద నిర్వహించిన దాడిలో భాగంగా ఎండు గంజాయిని ట్రాన్స్‌పోర్టు చేస్తున్న షేక్ నజీర్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంయి 150 గ్రాముల ఎండు గంజాయిని, డ్యూయెట్ స్కూటీ బైకుని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు ఎండు గంజాయిని సరఫరా చేసి షేక్ నజీర్‌కు అందజేయడానికి వచ్చిన కుక్కు సాయి, సలాది లక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ సీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి టి.రవీందర్ రావు మాట్లాడుతూ ఎవరైనా నిషేధిత పదార్థాలైన గంజాయి, డ్రగ్స్‌ని కలిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. గంజాయి, డ్రగ్ రహిత రాష్ట్ర ఏర్పాటులో భాగంగా సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 25 రోజుల నుంచి అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో అవగాహనా సదస్సులు నిర్వహించామని తెలిపారు. 30 మందిని బైండోవర్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డీటీఎఫ్ సరూర్‌నగర్ టి.సత్యనారాయణ రావు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ బి.వెంకన్న, కె.సమజ పాల్గొన్నారు.