Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి గాను ఉపకార వేతనాలు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలనీ, అర్హులైన విద్యార్థులందరికీ అందేలా చూడాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి లింగ్యా నాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీరాణి, జిల్లా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమాధికారి వినోద్, జిల్లాలోని ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్స్, బాధ్యులు పాల్గొన్నారు.