Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దళిత బంధు పథకం వరంలాంటిదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీలో దళిత బంధు పథకం పై మేడ్చల్, ఉప్పల్ నియోజక వర్గాల ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం సన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బి.మల్లేష్ యాదవ్, శామీర్ పెట్ జెడ్పీటీసీ అనిత, దమ్మాయిగూడ మున్సిల్ చైర్మన్ వి.ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.