Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
అల్వాల్ డివిజన్ ఓల్డ్ ఆల్వాల్లోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ విద్యాలయాల కంటే మెరుగైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుల సేవ ఎంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉపాధ్యాయులు వెంకటయ్య, నాయకులు నాగేశ్వరరావు, అరవింద్ కుమార్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మనబస్తీ మనబడి కార్యక్రమం..
మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల వెంకటాపురంలో మన బస్తి మనబడి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధి కోసం కొన్ని సూచనలు ఇచ్చినట్టు ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లి కావాల్సిన అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సరిపడా మరుగుదొడ్లు, విద్యుదీకరణ, తాగునీరు ఫర్నీచర్, పాఠశాల మరమ్మతులు, రాత బోర్డ్స్, వంటగది, భోజనశాల, అదనపు గదులు, ప్రహరీగోడ సంబంధించి మెమోరాండం కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీ.వీ భాస్కర్, అనిల్ కిషోర్ గౌడ్, మల్లెల శివ, ప్రభాకర్, సయ్యద్ మోసిన్, రాజేష్ కన్నా, రమ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.