Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల న్యాయ సేవా సాధికారత సంస్థ నామినేటెడ్ సభ్యులను ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవ సాధికారత సంస్థ సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ కోట సభ్యుడిగా డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొ. గాలి వినోద్ కుమార్ను నియమించారు. ఈ పదవిలో ఆయన రెండేండ్లు కొనసాగనున్నారు. 'ప్రజల వద్దకు న్యాయం-ప్రజలందరికీ న్యాయం' అనే నూతన కార్యక్రమాన్ని డీన్ ఫాకల్టీ ఆఫ్ లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరకు ప్రయివేట్ న్యాయ కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. న్యాయ సేవా సాధికారత సంస్థతోపాటు మానవ హక్కుల కమిషన్ న్యాయ కళాశాలలు సంయుక్తంగా రాజ్యాంగం -చట్టాలు- మానవ హక్కులుఅనే అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో వినోద్ కుమార్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపకులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆయనను అభినందించారు.