Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-బంజారాహిల్స్/కంటోన్మెంట్
రెనోవా ఆంకాలజీ హాస్పిటల్లో రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించడంతో ముందంజలో ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఆదివారం బంజారాహిల్స్ తాజ్ కష్ణలో జరిగిన కార్యక్రమంలో రెనోవా ఆంకాలజీ బ్రాండ్‌ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 15000 మందికి పైగా రోగులకు సుమారు 100 నుంచి 120 కోట్ల రూపాయాలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ క్రింద ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రస్తుతమున్న 450 పడకలను 750 పడకలకు పెంచేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేద రోగులకు మంచి ఆరోగ్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. అంతకు ముందు రెనోవా హాస్పిటల్స్ గ్రూపు గురించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. పెద్దిరెడ్డి శ్రీధర్ వివరిస్తూ అందరికీ అందుబాటైన ధరలలో అత్యాధునిక వైద్య చికిత్సలను పూర్తి నైతిక విలువలు పాటిస్తూ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మూడు సరికొత్త ఆంకాలజీ యూనిట్లను ఖమ్మం, అలహాబాద్, జైపూర్ లలో ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయాభాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినరు కుమార్, రెనోవా క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల బందం డాక్టర్ పీఎస్, దత్తాత్రేయ, రోజా కిరణ్, లలిత రెడ్డి, సౌమ్య, నిర్మల, జీవ ఫెర్టిలిటీ డా. సువర్చల, జేకే మీడియా మురళి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.