Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసరగుట్ట మహాశివరాత్రి జాతర బ్రహ్మౌత్సవాల్లో భాగంగా ప్రతియేటా భక్తులకు ఉచితంగా వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అదివారం కీసరగుట్టలో సంఘం అధ్యక్షుడు వంశరాజ్ మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ అన్ని దానాలోకెల్ల అన్నదానం ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ నాయకుడు భద్రారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బి.వెంకటేష్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా, కీసర సర్పంచ్ నాయకపు మాదురి, తదితరులు పాల్గొన్నారు.