Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అనీ, గ్రామ స్వరాజ్యం గురించి ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వారు మహాత్మాగాంధీ ఆశయం ప్రకారం గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తున్న సర్పంచు లను రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని గుర్తించి వారిని బేగం పేటలోని హరిత ప్లాజాలో సత్కరించారు. ఈ కార్యక్ర మానికి జేడీ లక్ష్మినారాయణ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఉన్నత చదువులు చదివిన యువత ఆలోచనను మంచివైపు మరలిస్తేనే దేశానికి మంచి యువతరం అందుతుందన్నారు. సర్పంచులు టెక్నాలజీ వైపు దృష్టి సారించి కొత్త కొత్త పద్ధతులను గ్రామాల్లో ప్రవేశపెట్టాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఏర్పాటు చేసిన ఆత్మీయ సర్పంచుల కార్యక్రమం చాలా గొప్పదన్నారు. నిస్వార్థంగా గ్రామాభివృద్ధి కోసం పని చేస్తున్న సర్పంచుల సేవలు చాలా విలువైనవి అన్నారు. వలసలను ఆపి గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పించాలని సూచించారు. అజరు మిశ్రా, మాజీ చీఫ్ అడిషనల్ సెక్రెట రీ మాట్లాడుతూ దేశ భవిష్యత్ అంతా గ్రామాల చేతుల్లో ఉందన్నారు. సర్పంచులు అందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేస్తే మరిన్ని గ్రామాలు మంచి మార్గంలో నడవలన్నారు. పల్నాటి రాజేంద్ర, ఫౌండర్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మాట్లాడుతూ గ్రామాలను మార్చాలనే వినూత్న ఆలోచనతో దేశంలోనే మొదటిసారిగా ఈ కార్యక్ర మం చేపట్టామన్నారు. ఆరునెలల నుంచి గ్రామాభివృద్ధి కోసం పని చేసిన సర్పంచుల కోసం వెతికి 18 మందిని ఎంపిక చేశామన్నారు. దేశంలోని ప్రతి గ్రామం ఇలా తయారు చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం జిల్లా బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి, సంగారెడ్డి జిల్లా హరిదాస్ పూర్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ షఫీ,సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామ సర్పంచ్ కె.జగదీశ్వర చారి, జగిత్యాల జిల్లా భూప తిపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్ గ్రామ సర్పంచ్ చెరుకు జాన్, సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం గ్రామ సర్పంచ్ కాసాల మల్లారెడ్డి, వరంగల్ జిల్లా మరియపురం సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి, జగిత్యాల జిల్లా నాగుల పేట గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, ములుగు జిల్లా నల్లగుంట గ్రామ సర్పంచ్ మందల సుచరితారెడ్డి, కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామ సర్పంచ్ పింగిళి రమాదేవి, సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి స్రవంతి, జగిత్యాల జిల్లా అంబా రీపేట గ్రామ సర్పంచ్ గొడిసెల గంగాధర్ రెడ్డి, జగిత్యాల జిల్లా తక్కళ్లపెల్లి గ్రామ సర్పంచ్ గొడుగు కుమారస్వామి, రంగారెడ్డి జిల్లా చింతపట్ల గ్రామ సర్పంచ్ సరిత, చీదేడ్ గ్రామ సర్పంచ్ బి.రమాకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.