Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ నెల బీపీ, షుగర్ మెడికల్ క్యాంప్ విజయవంతమైందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ అన్నారు. జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజ్గిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 78 నెలలుగా బీపీ, షుగర్ బాధితులకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం కరోనా సమ యంలోనూ కొనసాగించడం అభినందనీయమన్నారు. జన విజ్ఞాన వేదికకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటా యన్నారు. జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడారు. అనంతరం క్యాంప్‌కు వచ్చిన 175 మంది పేషెంట్స్‌కి డాక్టర్లు పరీక్షలు చేసి కావాల్సిన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దశరథ్, డాక్టర్ విద్యాసాగర్, శ్రీలేఖ, ప్రభురాజు, జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజ్గిరి మండల అధ్యక్షు లు పటేల్ నర్సింహులు, నరసింహారావు, ప్రధాన కార్యద ర్శిలు వెంకట రమణ, ఎం.ఎల్.చౌదరి, శివప్రసాద్ నాయ కులు శేషు, సోమయ్యచారి, రవి, రమణరెడ్డి, నాగేశ్వర రావు, కరుణాకర్ రెడ్డి, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.