Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం 'హునర్ హాట్' కార్యక్రమం చేపడుతున్నామని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 37వ హస్తకళా ప్రదర్శన (హునర్ హాట్) ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారం భించారు. సందర్భంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు 'మిషన్ మోడ్'పై కృషి చేయడం ప్రారంభించిందన్నారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. 'హునర్ హాట్' కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకు నేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గత ఏడేండ్లలో సుమారు 8 లక్షల మంది కళాకారులతోపాటు చేతివృత్తుల వారికి ఉపాధి, ఉపాధి అవకాశాలను అందించిందని తెలిపారు. మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న 'హునర్ హాట్'లో 30కి పైగా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 700 మందికి పైగా కళాకారులు, చేతివృత్తుల వారు పాల్గొంటున్నారని తెలిపారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'హునర్ హాట్' దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను, వారి పాత్రను కూడా అందంగా చిత్రీకరిస్తోందన్నారు. 'వోకల్ ఫర్ లోకల్' అనే ఇతివృత్తంతో దేశీయ వస్తువులకు విస్తత ప్రచారం, వినియోగించేలా ఈసారి తీర్చిదిద్దారని, దేశీయ వస్తువుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు హస్తకళాకారుల నైపుణ్యాలకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.