Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లీ సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని విజరు నగర్ కాలనీలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఫిట్నెస్, మార్చల్ ఆర్ట్స్ ట్రైనర్ ఎ.మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు పతకాలను అందజేశారు. ఫస్ట్ ఇంటర్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షియల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ -2022లో చిన్నారులు పలు పతకాలను గెలుచుకున్నారు. వాటిని జస్టీస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ అభి నంద్ కుమార్ షావ్లీ మాట్లాడుతూ చదువుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు తమతో పాటు దేశాన్ని కూడా కాపాడగలుగుతారని తెలిపారు.