Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్.ఎల్. నగర్ నాలుగో వార్డు టీఆర్ఎస్ అధ్యక్షులు జూలకంటి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో నాలుగో వార్డు కాలనీ వాసులు ఆదివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వార్డులో నెలకొన్న సమస్యలైన సీసీ రోడ్డులు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులు, స్మశాన వాటిక స్థలం కోసం కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడు తూ నాలుగో వార్డు సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులు కేటాయించి అభివీద్ధికి కృషి చేస్తామని హామీని చ్చినట్టు జూలకంటి రమేష్ గుప్తా తెలిపారు. అనంతరం నాలుగో వార్డు కు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, కాలనీకి చెందిన సుమారు రెండు వందల మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపె డుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అనంతరం జూలకంటి రమేష్ గుప్తా, నాగారం మున్సిపాలిటీ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్‌లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బీజ్జ శ్రీనివాస్ గౌడ్, దివ్య దయాకర్ రావు, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు, నాలుగో వార్డు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గంగరాజు హరికృష్ణ, నాయకులు జై చంద్రగౌడ్, అశోక్ గుప్తా, వేణు, మహేందర్ రెడ్డి, గోపాల్, వీరాచారి, పావని రెడ్డి, లావణ్య రెడ్డి, కాలనీ అనుబంధ సంఘాలు యూత్, విద్యార్థులు, మహిళ, కార్మిక, మైనారిటీ, బీసీలు, కాలనీవాసులు పాల్గొన్నారు.