Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
'తగ్గేదేలే'.. అంటూ జీహెచ్ఎంసీ ట్రేడ్ ట్యాక్స్ కౌంట్స్‌లో చార్మినార్ జోన్ నెంబర్ వన్‌గా నిలిచింది. పాతబస్తీ అయినా సరే కౌంట్స్, వసూళ్లలో ముందంజలో నిలిచి మిగతా సర్కిళ్లకు ఆదర్శమైంది. కమర్షియల్ సర్కిల్ దాటి టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది. పాత బస్తీలో గతంలో ట్రేడ్ ట్యాక్సీ కౌంట్స్, వసూళ్లు కనిపించేది కాదు. కానీ నేడు కౌంట్స్, వసూళ్లలో ముందంజలో దూసుకె ళ్తోంది. గ్రేటర్‌లోనే ఈ నెల రోజుల్లో రోజు వారి కౌంట్స్‌లో ఏ సర్కిల్ ఢ కొట్టకపోవడం గమనార్హం. ఇది మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చార్మినార్ జోన్ మలక్‌పేట్ సర్కిల్ ట్రేడ్ ట్యాక్స్ లైసెన్స్ విభాగం అధికారుల పని తీరుకు నిదర్శనమని సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
3 నెలల్లో 3 వేల ట్రేడ్స్
ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ కౌంట్స్, వసూళ్లలో మలక్‌పేట్ సర్కిల్ ఆధికారులు 3 నెలల్లో, 3వేల ట్రేడ్స్ చేశారు. ఈ ఒక్క నెలలో నేటి వరకు 176 కౌంట్స్ కాగా రూ.11, 80,619 వసూలు చేశారు. ఈ నెల రోజుల్లో గ్రేటర్‌లోని 30 సర్కిల్లు ఏ ఒక్క రోజు కూడా మలక్‌పేట్ కౌంట్స్ని ఢ కొట్టలేకపోయాయి. తమ టార్గెట్ మార్చి 31 వరకు పూర్తి అయ్యే దిశగా పనిచేస్తూ ముందకువెళ్తున్నారు. చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, మలక్‌పేట్ సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి ఆదేశానుసారంగా సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ కేవీ శివప్రసాద్ ఆధ్వర్యంలో శానిటేషన్ సూపర్వైజర్, ట్రేడ్ లైసెన్స్ ఆధికారి గోవింద్ రెడ్డి, అసిస్టెంట్ శానిటేషన్ సూపర్వైజర్, అసిస్టెంట్ ట్రేడ్ లైసెన్స్ ఆధికారి బి.నరేందర్ రెడ్డి బృందంతో కౌంట్స్, వసూళ్లు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రజాప్రతిని ధుల మధ్య అభ్యంతరాలు, అడ్డంకులు ఉన్నా వారిని సమన్వయం చేస్తూ తమ టార్గెట్ వైపు పరుగులు పెడుతున్నారు.
ట్రేడ్ లైసెన్స్‌తో ఉపయోగాలు
వ్యాపారం చేసే ప్రతి వ్యాపారీ ట్రేడ్ లైసెన్స్ తప్పక తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ లైసెన్స్‌తో వ్యాపారులు మూడేండ్లు కొనసాగిస్తూ రెన్యూవల్‌తో వ్యాపా రం చేసే వాపారులకు ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. ట్రేడ్ లైసెన్స్‌తో వ్యాపారం చేసే వారిలో జీహెచ్ఎంసీ, బ్యాంకులతో కలిసి ఎస్సీలకు 70శాతం, బీసీలకు 50శాతం, ఈబీసీలకు 50శాతం సబ్సిడీకి అవకాశం కల్పిస్తుందని పేర్కొంటున్నారు.