Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మహశివరాత్రి బ్రహ్మౌత్సవాలు వేదపండితుల మంత్రోచ్చరణలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం విఘ్నేశ్వర పూజతో వేదపండితులు బ్రహ్మౌత్సవాలను అంకురార్పణ చేశారు. పుణ్యాహవచనం, బుత్విక్ వరణం, యాగశాలా ప్రవేశం, ఆఖండ జ్యోతి ప్రతిష్టాపనం, అగ్ని ప్రతిష్టాపన, భేరిపూజ, ద్వజారోహణ, మంత్రపుష్పం, పరాకస్తనం, తీర్దప్రసాద పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
పూజలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
మహాశివరాత్రి జాతర బ్రహ్మౌత్సవాల్లో భాగంగా రాష్ట్ర కార్మికశాఖ చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జాయింట్ కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి విచ్చేయడంతో ఆలయ చైర్మెన్ తటాకం ఉమాపతి శర్మ, ఈఓ సూధాకర్ రెడ్డి వేదపండితులతో కలిసి పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం మహామండపంలో స్వామివారి ఆశీర్వచనలు, మమా ప్రసాదాలను వేదపండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, ఎంపీపీ మల్లారపు ఇందిరా, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ బి.వెంకటేష్, కీసర సహకార సొసైటీ చైర్మెన్ అర్.ప్రభాకర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు, సర్పంచులు నాయకపు మాదురి, గరుగుల అండాలు, కౌకుంట్ల గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలాల్పురం సూధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
క్రీడోత్సవాలు ఉత్సహంగా జరుపుకోవాలి : మంత్రి మల్లారెడ్డి
కీసరగుట్ట మహశివరాత్రి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా నిర్వాహిస్తున్న జాతర క్రీడలను ఉత్సహంగా క్రీడాకారులు జరుపుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అదివారం బ్రహ్మౌత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్టలోని జాతర క్రీడా ప్రాంగణంలో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కీసరగుట్ట జాతర ఉత్సవాలు వైభవంగా జరిగేలా అధికార యాంత్రాంగం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కేసరిగిరి క్షేత్రంలో బ్రహ్మౌత్సవాల్లో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలల్లో పాఠశాలలు పెరిగాయన్నారు. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ పలితాలు సాధించాలన్నారు. విద్యార్థి దశలోనే కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు.