Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ/హిమాయత్‌నగర్
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాల వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రేగా కాంతారావు ఆ మహనీయుని అవమానించినందుకు వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఆయన ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి పై దాడి చేయించడం ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర విద్రోహక చర్య అని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణను అడ్డుకున్న గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పిడమర్తి రవికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకట్, ఓయూ ˜్ అధ్యక్షులు బోరెల్లి సురేష్, రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆలూరి సుధాకర్, మంగళపల్లి ప్రవీణ్, వినోద్, రాజా రామ్ ప్రకాదాడులకు పాల్పడుతున్న అంబేద్కర్ వ్యతిరేక వాదులు'
ఇటీవల ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ పిడమర్తి రవి పైన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అతని అనుచరులతో రాళ్లు, కర్రలతో దాడి చేయించారని మాదిగ జేఏసీ ఆరోపించింది. జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ కో-ఆర్డినేటర్ జేరిపోతుల పాండురంగ, జిల్లా అధ్యక్షులు జెరిపోతుల సాయన్న మాట్లాడుతూ పిడమర్తి రవిపై దాడి చేయించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొందరు అంబేద్కర్ వ్యతిరేక వాదులు, అంబేద్కర్ ఆలోచనా విధానాలను దళితుల నుంచి దూరం చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేగా కాంతారావు వెంటనే పిడమర్తి రవికి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రాష్ట్రంలోని అంబేద్కర్ వ్యతిరేకులపై యుద్ధం మొదలుపెడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు నాగరాజు, ధన్ రాజ్, ఎండి.బర్గర్ తదితరులు పాల్గొన్నారు.