Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ జాజు
నవతెలంగాణ-ధూల్‌పేట్
కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డుల ద్వారా అందిస్తున్న ఉచిత బీమా సౌకర్యాన్ని అసంఘటితరంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ జాజు అన్నారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డా.బి.నీలిమ ఆధ్వర్యంలో బేగంబజార్ సిక్వాల్ ప్రగతి సమాజ్, శంగరుషి భవన్లో ఈ శ్రమ్ కార్డు పేర్ల నమోదు, కార్డు పంపిణీల కార్యక్రమం నిర్వహించారు. కార్మికులకు ఈ శ్రమ్ కార్డు ఎంతో దోహదపడుతుందన్నారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు ఈ-శ్రమ్ కార్డును నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం అసంఘటిత కార్మిక సామాజిక భద్రతా మండలి చైర్మెన్ వి.దేవేందర్ రెడ్డి, సిక్వాల్, ప్రగతి సమాజ్ సభ్యులతో కలిసి కార్మికులకు ఈ శ్రమ్ కార్డులు అందజేశారు.