Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం
నవతెలంగాణ-అడిక్మెట్
శాంతి మాత్రమే మానవ స్వభావంలో భాగమని, యుద్ధం కాదని ప్రపంచ శాంతితో మెరుగైన ప్రపంచం కోసం ప్రజలందరూ కలిసి పని చేస్తున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షులు యాదవ రెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. సుధాకర్ తెలిపారు. 'యుద్దాన్ని ఆపి శాంతిని పునరుద్ధరించండి' అని విజ్ఞప్తి చేస్తూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం హైదరాబాద్ జిల్లా సమితి సోమవారం హైదరాబాద్, ట్యాంక్ బండ్పై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్బంగా తక్షణమే యుద్దాన్ని ఆపాలి - ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని వారు పెద్దఎత్తున నినాదాలు చేసారు. యాదవ రెడ్డి, డాక్టర్ డి సుధాకర్ ఈ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధం ఎల్లప్పుడూ మానవాళి అస్తిత్వనికి ముప్పుగా ఉంటుందన్నారు. యుద్ధం క్రూరత్వం తీవ్రమైతే అనివార్యంగా మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని, యుద్ధాన్ని మరింత పొడిగించకుండా వివాదాల శాంతియుత పరిష్కారానికి అనుకూలమైన వాతావరణాన్ని సష్టించి పరిష్కరించుకోవాలన్నారు. ప్రపంచ మహమ్మారి, సముద్ర కాలుష్యం, జీవవైవిధ్య నష్టం, అణు విస్తరణ మరియు వాతావరణ మార్పు వంటి తీవ్రమైన సమస్యలను, సవాళ్ళను నేడు ప్రపంచం ఎదుర్కొంటుందని, ఈ సవాళ్లను, సమస్యలను అధికమించడానికి అంతర్జాతీయ సహకారాలు చాల అవసరమన్నారు. యుద్ధలతో మానవ ఉనికికి ముప్పు ఏర్పడుతుందని రష్యా, ఉక్రేన్ దేశాలు గమనించాలని, వెంటనే యుద్దాన్ని విరమించి శాంతి చేర్చాలా ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని కోరారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర నాయకులూ కేవీఎల్, ఇందిరా శోభన్, గోవింద్, తిప్పర్తి యాదయ్య, రామ రాజు, మెట్ల జగన్, నరహరి, బచ్చన్ సింగ్ పాల్గొన్నారు.