Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని దేవేందర్‌నగర్ నర్సింహబస్తీలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో నాయకులు మురళీకృష్ణ, మహేందర్‌రెడ్డి, సూర్య, తిరుపతి, రాఘవ, రమేష్, అరుణ తదితరులు పాల్గొన్నారు.