Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఇంజినీరింగ్ కళాశాల గణితశాస్త్ర నూతన హెడ్‌గా డా.కె.రమేష్ బాబు నియమితులయ్యారు. సోమవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ నుంచి నియామక పత్రం స్వీకరించి తన ఛాంబర్లో హెడ్ గా బాధ్యతలు చేపట్టారు. రమేష్ బాబు గతంలో సికింద్రాబాద్ పీజీ కళాశాల గణిత శాస్త్ర హెడ్‌గా 3 మార్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఐదేండ్లు పని చేశారు. రమేష్ బాబు విద్యా, పరిశోధన, సేవా రంగాలలో అందిస్తున్న సేవాలకు గాను వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుండి 4 అవార్డ్స్ స్వీకరించారు. ఆయనకు విద్యార్థులు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.