Authorization
Wed March 19, 2025 05:52:39 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జై గౌడ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ బీసు వెంకటేశంగౌడ్ నియమితులయ్యారు. సోమవారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు, రాష్ట్ర అధ్యక్షులు శేషగాని నరేష్గౌడ్ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవి అప్పగించినందుకు జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు, రాష్ట్ర అధ్యక్షులు శేషగాని నరేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాస్గైడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్‌గౌడ్, కేశవగౌడ్, బి.శంకర్, మధుగౌడ్, మహిళలు అనురాధగౌడ్, స్వప్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.