Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ పోలీసు స్టేషన్లో బహుజన విద్యార్థి సంఘాల ఫిర్యాదు
నవతెలంగాణ-ఓయూ
ఓయూలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ సెంటర్(ఆర్సీయూఈఎస్) ప్రధాన గేటుకి తాళాలు వేసి ఆఫీసులోకి ఎవరిని రానివ్వకుండా పాలనచేస్తున్న డైరెక్టర్ ప్రొ కుమార్ పై కేసు నమోదు చేసి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్కు సోమవారం ఓయూ బహుజన విద్యార్థి సంఘాల, ఓయూ జేఏసీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 'ప్రభుత్వ సంస్థలో పనిచేసే అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకంగా పాలన సాగించాలి. కానీ డైరెక్టర్ ప్రొ.ఎం. కుమార్ తన సొంత ఆస్తి లాగా భావించి లోపలికి ఎవరిని రానివ్వడంలేదన్నారు. ప్రధాన గేటుకి తాళాలు వేసి పాలన చేస్తున్న అతనిపై కేసు నమోదు చేసి చట్టరీత్య తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల. సంజరు, ఓయూ జేఏసీ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, బీఎస్ఎఫ్ అధ్యక్షుడు పోమాల అంబేద్కర్, పి. సురేష్, చంద్రశేఖర్, జగదీశ్, రాజ్ కుమార్, నగేష్ పాల్గొన్నారు.