Authorization
Wed March 19, 2025 05:18:13 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం మధురానగర్‌లో రూ.2.46 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను, రూ.27లక్షలతో చేపట్టిన సీవరేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అడ్డగుట్టలో రూ.2.25 కోట్లు, లాలాపేటలో రూ.6.9 కోట్లతో కొత్తగా ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మధురానగర్ కాలనీలోని ఎస్ఆర్ ఆస్పత్రిలో డాక్టర్ సంజీవ్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్‌ను షురూ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, జలమండలి జీఎం రమణా రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ఆశాలత, వై కష్ణ, మధురిమ, టీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.పవన్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.