Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో అధికారుల నిర్లక్ష్యం వల్ల హరితహారంలో నాటిన వందల వక్షాలను కాల్చి వేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 'సైన్స్ అండ్ హ్యుమానిటీస్ బిల్డింగ్ వెనకాల హరితహారంలో నాటిన వక్షాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. అలాగే ఓయూలో ఎన్నడూ లేని విధంగా చెట్లను నరికివేస్తున్నారు. యూనివర్సిటీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. అధికారులు వెంటనే మొక్కలను, వక్షాలను కాపాడి పర్యావరణ పరిరక్షణకు కషి చేయాలి' అని డిమాండ్చేశారు. లేకపోతే పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని చెప్పారు. సోమవారం ఓయూలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఓయూ ఉపాధ్యక్షులు విజరు నాయక్, కరణ్ పాల్గొన్నారు.