Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ప్రాథమిక దశలోనే నిబంధనలు ఉల్లంఘించే గహ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా ఏక్తాపార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం గౌలిగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో అనేక అక్రమ వాణిజ్య, గహ భవనాలు నిర్మించారని ఆరోపించారు. కొంత మంది రాజకీయ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు కుమ్మక్కై వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఓ కుటుంబం జాంబాగ్ యాదవ సంఘం లైన్లో గతంలో నిర్మించిన ఐదు అంతస్థుల భవనాన్ని జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పాక్షికంగా కూల్చివేయడంతో ఆ కుటుంబ మనోవేదనకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాథమిక స్థాయిలోనే నోటీసులు జారీ చేస్తే బాగుంటుందని అన్నారు. ఎంతో కష్టపడి భవనం నిర్మించిన తర్వాత అధికారులు కుట్రపూరితంగా భవనాన్ని పాక్షికంగా కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు కొంత మంది అధికారులు భవన నిర్మాణదారుల పాలిట పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై బల్దియా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.