Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పీహెచ్‌డీలో అవకతవకల పేరు మీద యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని జేఎన్టీయూ జేఏసీ వైస్ ప్రెసిడెంట్, బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎల్. భాను ప్రకాష్ నాయక్ అన్నారు. పార్ట్ టైం పీహెచ్డీ ఫలితాలను వెంటనే ప్రకటించాలని జేఎన్టీయూహెచ్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ డైరెక్టర్ ఎ.గోవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ రిజల్ట్ కమిటీ సభ్యులు కలిసి సెలక్ట్ చేసిన పీహెచ్డీ సెలక్షన్ లిస్ట్ ఇంతవరకు పూర్తి చేయకపోవడం అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పార్ట్ టైం పీహెచ్డీ అడ్మిషన్లు అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అయితే కమిటీలోని ఆరుగురు సభ్యులు, వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని దశలవారీగా ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మెన్ రాజ్‌కుమార్, ఎంఎస్ఓ అధ్యక్షులు సయ్యద్ వసీం, కరణ్, అఖిల్, ప్రణరు, షాహిస్తా, కవిత, దుర్గ తదితరులు పాల్గొన్నారు.