Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ డివిజన్ వైఎస్సార్ పార్కులో లబ్దిదారులకు (రఘు రూ.20 వేలు, ఎండి. తాకి రూ. 60 వేలు, భాను రూ.60 వేలు, షేక్ హుస్సేన్ రూ. 60 వేలు, మహమ్మద్ అలీ ఖాన్ రూ.60 వేలు, సత్యనారాయణ రూ. 69 వేలు, ఫాతిమా భి రూ.27 వేలు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందన్నారు. అనారోగ్యంతో ఉన్న పేద వారు దరఖాస్తులు చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శ్రీధర్ రెడ్డి, సాంబశివరావు, బిక్షపతి యాదవ్, శివ ముదిరాజ్, ఎయిర్టెల్ రాజు, అజరు ముదిరాజ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రవి యాదవ్, గంటల రాజు, ముత్యం బాల్ రాజ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, జావీద్ ఖాన్, శాయ్యద్ బారు, నాని, టీఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షులు రజిని, ప్రేమలతా రెడ్డి, శ్రీవల్లి, శోభ, మేరీ, సుకన్య, శ్రీధర్ శర్మ, సదానంద్ పాల్గొన్నారు.