Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ
నవతెలంగాణ-ముషీరాబాద్
డబ్బులు, పేదరికంతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. లోక్సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'అందరికీ ఆరోగ్యం హక్కుగా వైద్యసేవలు- లోక్సత్తా ప్రతిపాదించిన సమగ్ర ఆరోగ్య విధానం ఆచరణ సాధ్యం నమూనా'పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన రాజకీయ పార్టీలు తాయిలాలను పక్కాగా అమలు చేస్తున్నాయి తప్ప ప్రజల జీవన ప్రమాణాలను పెంచే మంచి విద్యను ఆరోగ్యాన్ని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉచిత విద్య, ఆరోగ్యం పేరిట విలువైన సేవలు కాకుండా నాణ్యమైన ప్రమాణాలతో కూడిన మంచి విద్య ఆరోగ్యం హక్కుగా అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, సీపీఐ నాయకులు పశ్య పద్మ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇందిరా శోభన్, టీడీపీ నాయకులు తిరునగరి జ్యోత్స్న, జనసేన నాయకులు రాజలింగం, బహుజన రాజ్యం పార్టీ నాయకులు కాలే జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.