Authorization
Fri March 21, 2025 10:21:10 pm
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
గ్రామీణ హస్తకళలను కాపాడాలంటే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను తెలంగాణ రాష్ట్ర బోర్డు అధికారి ప్రవీణ్ మార్, సేర్క్ మాజీ కమిషనర్ రామలింగేశ్వర ఐఎఫ్ఎస్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సిల్క్ ఎక్స్పోను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత హస్తకళలను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. ప్రతి పండుగకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి సంప్రదాయ సాంస్కతిక విలువలను కాపాడాలని సూచించారు. రెండు వేల ఏండ్ల నుంచి చేనేత హస్తకళ ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ సిల్క్ బోర్డు రిటైర్డ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు