Authorization
Wed March 19, 2025 08:33:50 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చిన్నారుల పోలియో బారిన పడకుండా 0-5 ఏండ్లలోపు ప్రతి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ ఆర్య అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ పంచశీలకాలనీలోని రాజ్యలక్ష్మీ ఇండిస్టీస్ ప్రాంగణంలో 350 మందిపైగా చిన్నారులకు పల్ ్స పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో లయన్ డాక్టర్ జయరామ్, లయన్ డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి, లయన్ విష్ణువర్ధన్‌రెడ్డి, శాంతి వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.