Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూల్‌గా తీర్చి దిద్దుతున్నారని చింతల్ డివిజన్ కార్పొరేటర్ రశీదాబేగం అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ హైస్కూల్, ప్రయిమరీ పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ఫేర్‌ను ఆమె పాల్గొని ప్రారంభించారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్ఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో హై స్కూల్స్‌కి రూ.63 లక్షలు, ప్రయిమరీ స్కూల్స్‌కి రూ.22 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, శ్రీనివాస్‌నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్, వివేకానందనగర్ అధ్యక్షులు చందు, బాల్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
-నవతెలంగాణ, జగద్గిరిగుట్ట
విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను సైన్స్ఫేర్ల ద్వారా వెలికితీయవచ్చని నీలోఫర్ చైల్డ్ స్పెషలిస్టు డాక్టర్ రవీందర్ అన్నారు. ఐడీపీఎల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ఫెయిర్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులు తయారు చేసిన పలు నమునాలను పరిశీలించారు. విద్యార్థులు తమ మేధస్సుకు మరింత పదను పెట్టినట్లు ప్రతిభను కనబరిచారన్నారు. కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ప్రిన్సిపల్ పద్మజ, వైస్ ప్రిన్సిపల్ సుమ, డీన్ శ్రీనివాస్, జోనల్ కో అర్డినేటర్ మురళీకృష్ణ, సీ బ్యాచ్ ఇన్చార్జి గీతా, అసోసియేట్ డీన్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-నవతెలంగాణ, జగద్గిరిగుట్ట
సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న కార్పొరేటర్ విజయ రెడ్డి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శారదా, సెక్రెటరీ ఎం శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ సురేష్ కుమార్, ట్రెజరర్ సోమలింగం, ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
-నవతెలంగాణ, బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ జన విజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో యూసఫ్‌గూడ చెక్ పోస్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవీవీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎల్.కాంతారావు హాజరై మాట్లాడుతూ ప్రగతి, స్వాలంబన, శాంతి వంటి ఆశయాలతో శాస్త్ర విజ్ఞానం రంగంలోనికి ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు జన విజ్ఞాన వేదిక నిరంతరం కషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమం జేవీవీ హైదరాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే చంద్రశేఖర్ రావు, సభ్యులు ఆర్ అశోక్, గవర్నమెంట్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయులు శాంతి సత్యవాణి, విమల, నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
-నవతెలంగాణ, జూబ్లీహిల్స్
సీతాఫల్మండి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన పరికరాలను పరిశీలించిన కార్పొరేటర్ సామల హేమ. ఉన్నత శిఖరాలు అధిరోహించి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. -నవతెలంగాణ, ఓయూ
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు తయారుచేసి పరికరాలను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఈ సందర్భంగా ఏడో తరగతి విద్యార్థి అఖిల్ తయారుచేసిన మిక్ రోబోట్ పరికరాన్ని చూసి తక్షణమే రూ.వేయి బహుమానం అందించి ప్రోత్సహించారు. అలాగే స్కూల్ అభివద్ధి పనుల్లో భాగంగా కొత్త బిల్డింగ్ కోసం 2000 గజాల స్థలం కేటాయించేలాగా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ రాధాపద్మజ, ప్రయిమరీ స్కూల్ ప్రిన్సిపాల్ గోవింద్, ఎస్ఎంసీ చైర్మెన్లు టి.మల్లయ్య, జె.రేణుక, డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, మహిళా గౌరవ అధ్యక్షులు మధులత, స్వరూపరాణి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, ప్రీతి, ఫారూఖ్ పాల్గొన్నారు. -నవతెలంగాణ, కూకట్పల్లి