Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మరమ్మతులకు
సహకరిస్తున్న పూర్వ విద్యార్థులు
- కెమిస్ట్రీ ఫౌండేషన్‌తో దశ మారిన విభాగం
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ (రసాయనిక శాస్త్రం ) విభాగం నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు, ఉపాధికి పెట్టింది పేరు. ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలను, సైంటిస్టులను ప్రపంచానికి, దేశానికి అందించిన ఘనత ఈ విభాగానికి ఉంది. ఇలా ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 2017లో విభాగ అభివృద్ధి కోసం 'ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్'గా ఏర్పడినారు. నాటి నుంచి అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపిస్తున్నారు.
మరమ్మతులకు శ్రీకారం
-పూర్వ విద్యార్థి, ప్రముఖ వ్యాపారవేత్త, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మెన్ డా.బి. పార్థసారథి రెడ్డి ఇన్ ఆర్గానిక్, ఆర్గానిక్ ప్రీవీఎస్ ప్రయోగశాలలకు, మరొక పూర్వ విద్యార్థి ఎంఎస్ఎన్ రెడ్డి ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్ మరమ్మతులు పూర్తి చేశారు.
-కొన్నేండ్లుగా విభాగంలో పావురాల బెడద తీవ్రంగా ఉండేది. ఇవి శబ్దం చేయడంతో పాటు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నా క్రమంలో దానికి పూర్వ విద్యార్థులు వల (నెట్ ), విద్యార్థుల స్ఫూర్తి సందేశం కోసం నవంబర్‌లో స్మారక ఉపన్యాసాం ఏర్పాటు చేశారు.
-ఇక పూర్వ విద్యార్థులు ఇచ్చిన స్ఫూర్తితో విభాగంలో పనిచేస్తున్న హెడ్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక్కొక్కరు రూ 10వేలు ఓయూ సీఎఫ్కు అందజేశారు.
ప్రతిభకు ప్రోత్సాహం
పూర్వ విద్యార్థి హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్ డా.బి. పార్థసారథి రెడ్డి ప్రస్తుతానికి విభాగంలో విద్యను అభ్యసిస్తూ మెరిట్లో నిలిచిన మొదటి విద్యార్థికి ఒక లక్ష, గోల్డ్ మెడల్, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ 50వేలు, సిల్వర్ మెడల్, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ 25వేలు, కాపర్ మెడల్స్‌తో పాటుగా 10 స్థానాల్లో నిలిచిన విభాగం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఇటీవలే జరిగిన ఓయూ సీఎఫ్ సమావేశంలో పార్థసారథి రెడ్డి ప్రకటించారు. వీటితో పాటుగా పారిశ్రామిక శిక్షణ తోపాటుగా 3 నెలలకు స్కాలర్ షిప్ ( ఇంటర్న్‌షిప్ ) అందజేస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో చేపట్టేవి
-ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానిక్్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్, ప్రయోగశాలను మరమ్మతులు
-10 మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో మరమ్మతులు
-వాటర్ లైన్స్, భవన్ లీకేజీలు, భవనానికి కలర్స్, నూతనంగా విద్యుత్ వైరింగ్ ఏర్పాటు
-ఇంకా మిగిలి ఉన్న 22 రీసెర్చ్ ల్యాబ్స్ మరమ్మతులు
-6 తరగతి రూమ్స్‌ను 'ఈ క్లాస్ రూమ్స్'గా అధునాతన టెక్నాలజీ సౌకర్యాలతో ఏర్పాటు
మెగా డోనర్స్‌కు ధన్యవాదాలు
కెమిస్ట్రీ విభాగం అభివద్ధికి కృషిచేస్తున్న మెగా డోనర్స్‌కు ధన్యవాదాలు. ఓయూ సీఎఫ్ విజ్ఞప్తి మేరకు మెగా డోనర్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని పూర్వ విద్యార్థులు విభాగ ఉన్నతికి తోడ్పాటు ఇవ్వాలి.
- ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, విభాగం హెడ్
విభాగ రుణం తీర్చుకునే ప్రయత్నం
విభాగం ఉన్నతికి కోసం ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్‌ను 2017లో ఏర్పాటు చేసుకున్నాం. విభాగానికి కావాల్సిన ప్రాథమిక వనరులు ఏర్పాటు చేసి, ల్యాబ్స్ మరమ్మతులు చేపడుతున్నాం. మెరుగైన పరిశోధనలకు ఊతం ఇస్తూ, మేధావుల,అధ్యాపకులతో లెక్చర్స్ ఇస్తూ విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నాం.
-ఎ. భాస్కర్ రెడ్డి,
ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి