Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'సేవ రత్న' డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర హౌం శాఖ మంత్రి ముహమ్మద్ మహమ్మద్ అలీ 70వ జన్మదినం పురస్కరించుకొని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రిలో సుమారు వెయ్యి మంది నిరుపేద రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ముజీబ్ మాట్లాడుతూ మహమూద్ అలీ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మలిదశలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పదవులు చేపట్టారనీ, భగవంతుడు వారిని ఆయురారోగ్యాలతో ఉంచాలని, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పదవులు చేపట్టాలని ప్రార్థించారు. అంతకుముందు టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్, సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ సమక్షంలో హౌంమంత్రి నివాసంలో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. సెంట్రల్ యూనియన్ నాయకులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్ మాట్లాడుతూ మహమూద్ అలీ నిండు నూరేండ్లు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉద్యోగుల పట్ల ఇలాగే ఉండాలని మనసారా భగవంతుని కోరుకున్నారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్జీవోస్ నాయకులకు హౌంమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎం.ఏ.ముజీబ్, ఖాలీద్ అహ్మద్, వైధిక్ శాస్త్ర, శంకర్, ఎం.డీ.వహీద్, క్యాన్సర్ ఆస్పత్రి సభ్యులు సుధాకర్, శివ కుమార్, వివిధ యూనిట్ల ఉద్యోగులు, మిత్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.