Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 85వ జయంతి వేడుకలను బుధవారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న డాక్టర్ కెఎస్బి రావు, డాక్టర్ శ్రీనివాస్ మంతా, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, నరేష్ యాదవ్‌లను శ్రీపాదరావు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీపాదరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. అసమానమైన వ్యక్తి శ్రీపాదరావు అని, ఎన్ని అవాంతరాలు ఎదురైన తన లక్ష్య సాధనకోసం కషిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఎన్నికల్లో సంస్కరణలు అవసరం అన్నారు. భూములు జాతీయం చేయాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచనలు ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితాంతం ప్రజలకు నిరంతరం సేవలందించిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అన్నారు . ఆయన సేవలు చిరస్మరణనీయం అని కొనియాడారు. శ్రీపాదరావు తనయుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీపాదరావు సతీమణి జయశ్రీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం . అంజనకుమార్ యాదవ్, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి, ఆంధ్రభూమి మాజీ ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్త్రి , ఎన్ఎఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే మిజయారమణారావు తదితరులు పాల్గొన్నారు.