Authorization
Fri March 21, 2025 11:24:49 am
నవతెలంగాణ-అంబర్‌పేట
రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా హ్యాండ్ బోర్లకు మరమత్తులు చేపట్టి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ విజరు కుమార్‌గౌడ్ అన్నారు. అంబర్‌పేట డివిజన్ పరిధిలోని చెన్నారెడ్డినగర్‌లో పాడైపోయిన హ్యాండ్ బోరుకు బుధవారం మరమత్తులు చేపట్టారు. రాబోయే వేసవి కాలాన్ని దష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా పాడైపోయిన హ్యాండ్ బోర్లు, విద్యుత్ బోర్లకు మరమత్తులు చేపడుతున్నామని అన్నారు. ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ సహాకారంతో జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రంగు సతీష్‌గౌడ్, మహేష్ ముదిరాజ్, చిమ్మి వేణు, లవంగు నాగరాజు, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.