Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-కల్చరల్
విదేశాల్లో వత్తి లేదా విద్యరీత్యా స్థిరపడిన తెలంగానీయులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విస్మరించకుండా విశ్వవ్యాపితం చేస్తున్నారని సాంస్కతిక పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) నిర్వహణలో శివరాత్రి సంబరాలు, సమ్మక్క సారలమ్మ జాతరను మంత్రి ఆన్లైన్ వేదికగా ప్రారంభించి మాట్లాడుతూ విదేశాలలో ఉన్న తెలంగాణ వారు మట్టి వాసన మరువక సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ చారిత్రక వారసత్వాన్ని నిలపెడుతున్నారని అభినందించారు. ముఖ్యమంత్రి కేఉసీఆర్ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని రాబోయే తరాలకు అందించాలన్న తపనతో ఉన్నారని వివరించారు. నైటా అధ్యక్షులు రవీంద్ర కుమార్ కంటం మాట్లాడుతూ దూరంగా జన్మ భూమిని వదలి ఉంటున్న తమ ఆత్మ తెలంగాణనేనని భాష సంప్రదాయలను కాపాడుకోని తమ పిల్లలకు నేర్పుతున్నా మని తెలిపారు. సమ్మక్క సారాలమ్మ జాతర కుంభ మేళా అని అభివర్ణించారు. చైర్మెన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి సతీష్ కాలువ, ప్రధాన కార్యదర్శి కొండ వాణి, కోశాధికారి కె.గీత తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలు మన టీవీ, టీవీ ఆసియా, కల్చరల్ టీవీ వేదిక గా పెరిణి సందీప్ బందంతో సమ్మక్క సారలమ్మ నత్య రూపకం, జానపద గాయకులు మానుకోట ప్రసాద్, నిర్వహణలో బంధం రాజు, శిరీష, లావణ్య జానపద గీత లహరి, బాల గాయకుడు సాయి కుమార్ జానా పద గీతలు ఆకట్టుకొన్నాయి. న్యూయార్క్ స్థానిక బాల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.